Tamannaah: విజయ్‌తో బ్రేకప్.. సంచలన కామెంట్స్ చేసిన తమన్నా!

మిల్క్ బ్యూటీ తమన్న- బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గత కొన్ని నెలలుగా రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ హోటల్, రెస్టారెంట్స్, పెళ్లి వేడుకలకు కలిసే వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఈ జంట త్వరలోనే ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఈ తరుణంలోనే వీరిద్దరూ విడిపోయారని షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అని వార్య కారణాలవల్ల తమన్నా, విజయ వర్మ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలిసింది. ఇద్దరికీ అభిప్రాయ భేదాలు రావడంతో ఒకరినొకరు గుడ్ బై చెప్పుకున్నారని సమాచారం. ఈ విషయంపై తాజాగా తమన్నా స్పందించింది. ఓ పాడ్ కాస్ట్ లో లవ్ అండ్ రిలేషన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

లవ్ అండ్ రిలేషన్ విషయంలో చాలామంది అయోమయం పడుతుంటారని.. అయితే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుందని తమన్న చెప్పుకొచ్చింది. లవ్ లో ఎప్పుడూ కండిషన్ ఉండకూడదని.. అన్ కండిషన్ గానే ఉండాలని తెలిపింది. మనకు నచ్చినట్లు పార్ట్నర్ ఉండాలని ఎప్పుడూ రూల్స్ పెట్టకూడదని చెప్పింది.

ప్రేమను ఎప్పుడూ ఫీల్ అవ్వాలని తెలిపింది. చెప్పిందే చేయాలని కండిషన్స్ కూడా ఉండకూడదని.. అలా చేస్తే అది లవ్ కాదని బిజినెస్ వంటిది అని చెప్పుకొచ్చింది. తాను ఎవరిని ప్రేమించిన స్వేచ్ఛగా ఉండనిస్తానని తెలిపింది. ఈ మేరకు సింగల్ గా కంటే రిలేషన్ లో ఉన్నప్పుడే ఎక్కువ హ్యాపీగా ఉన్నట్లు చెప్పింది.

అయితే లవ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. మంచి పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పింది. ఎందుకంటే తల్లిదండ్రులను ఎలాగూ ఎంపిక చేసుకోలేరు. కాబట్టి స్నేహితులును పాట్నర్లను మనమే ఎంచుకోవాలని తమన్న చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య పెళ్లి విషయంలోనే మనస్పర్ధాలు వచ్చి విడిపోయినట్లు అర్థమవుతుంది.

తరవాత కథనం