చాలా మందికి దూర ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా టూరిజం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండే అందమైన ప్రదేశాలను చూసేందుకు ఇష్టం చూపిస్తారు. కానీ దానికి చాలా డబ్బులు ఉండాలని అనుకుంటారు. అయితే అలాంటి వారికి ఈ న్యూస్ బాగా ఉపయోగపడుతుంది.
తక్కువ బడ్జెట్‌తో అందమైన ప్రదేశాలు చూడాలి అనుకునేవారికి వియత్నాం బెస్ట్ ఆప్షన్. ఇది తక్కువ బడ్జెట్‌లో గొప్ప ప్రయాణ అనుభవాన్ని పొందగల దేశం. తక్కువ డబ్బుతో విదేశాలకు వెళ్లాలనుకుంటే, వియత్నాం గొప్ప, సరసమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. దక్షిణాసియాలో వియత్నాం చాలా అందమైన దేశం. వియత్నాంలో భారత రూపాయి విలువ చాలా ఎక్కువ.
వియత్నాంలో ఒక భారతీయ రూపాయి 299 వియత్నామీస్ డాంగ్‌కి సమానం. అందువల్ల తక్కువ డబ్బుతో ధనవంతుల జీవితాన్ని గడపవచ్చు. దాదాపు 1,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న వియత్నాంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో 500 మిలియన్ సంవత్సరాల నాటి చరిత్రను ప్రతిబింబించే 1,969 సున్నపురాయి ద్వీపాలు ఉన్నాయి.
హాలాంగ్ బే గుహలను చూడటానికి ప్రజలు కాయక్‌లు లేదా జంక్ బోట్‌లను అద్దెకు తీసుకుంటారు. వియత్నాంలోని బా-నా కొండలపై సముద్ర మట్టానికి 3,280 అడుగుల ఎత్తులో గోల్డెన్ బ్రిడ్జ్ ఉంది. ఈ వంతెన గోల్డ్ కలర్‌లో ఉంటుంది. దీని డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వంతెన 2018లో ప్రారంభించబడింది.
ప్రస్తుతం ఇది వియత్నాంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి. వియత్నాం సంస్కృతి, ప్రకృతి అందాలను దగ్గరగా చూడాలనుకుంటే హనోయి నుండి 135 కి.మీ దూరంలో ఉన్న మే చౌ గ్రామాన్ని తప్పకుండా సందర్శించండి. ఇక్కడ స్థానిక మార్కెట్ నుండి షాపింగ్ చేయవచ్చు. వియత్నామీస్ హస్తకళలను కొనుగోలు చేయవచ్చు.