ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. నేడే ఆఖరి పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
క్రికెట్ ప్రియులు, టీమిండియా అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ అంశం నిట్టెంటా చర్చగా మారింది. భారత్ ఇప్పటివరకు 14 వన్డేల్లో టాస్ ఓడిపోయింది. ఈసారైనా గెలుస్తారా లేదా అనేది చర్చనీయాంశమైంది.
అందులోనూ కెప్టెన్ రోహిత్ శర్మ 11 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఫైనల్ లో టాస్ గెలవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.
ఆఖరిపోరులో టీమిండియానే ఫేవరెట్ గా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. తన అభిప్రాయం ప్రకారం భారత్ ఈసారి కూడా టాస్ గెలవకుండా ఉంటేనే మంచిదని అన్నాడు. ఆ ఛాయిస్ కివీస్ కే వదిలేయాలని చెప్పుకొచ్చాడు.
భారత్ ఇప్పటివరకు ఈ ట్రోఫీలో టాస్ ఓడిపోయింది. కానీ లక్ష్య చేధనకు దిగినా.. ఫస్ట్ ఇన్నింగ్ ఆడిన విజయం సాధించింది అని అన్నాడు. ఈసారి కూడా తప్పకుండా టీమిండియా నే విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాడు.