కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదట కోలీవుడ్లో డ్రాగన్ పేరుతో విడుదలై మంచి హిట్ అందుకుంది. దానిని తెలుగు వెర్షన్ లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో ఇటీవల రిలీజ్ చేశారు. తెలుగులో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
దాదాపు ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రానికి అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం వహించగా.. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ గురించి దర్శకుడు అశ్వత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఈ సినిమాలోని కొన్ని సీన్లు తన నిజ జీవితంలో జరిగినవేనని అన్నాడు. తాను కూడా మొదట్లో 90% స్టూడెంట్ నే అని.. కాలేజీలో అడుగు పెట్టాక తన తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పే వాడినని అన్నాడు. అంతేకాకుండా తాను ఈ స్థాయికి రావడానికి తన ఫ్రెండ్స్ కారణమని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్ తో పాటు వారి రూమ్ లో ఉండటం.. అలాగే వారి శాలరీ లోంచి నెలకు రూ.2,000 తీసుకోవడం చేసేవాడినని చెప్పాడు.
ఇలా చాలా సీన్లు తన నిజ జీవితంలో నుంచి రాసుకున్నవేనని అన్నాడు. ముఖ్యంగా తాను షార్ట్ ఫిలిం తీసేటప్పుడు ఫ్రెండ్స్ ఎంతగానో సహాయం చేశారని తెలిపారు. వారితో పాటే ఫ్రీగా రూమ్ లో ఉండే వాడినని.. తనలో ఏదో టాలెంట్ ఉందని వారు నమ్మి తలా రెండు వేలు వేసి తన షార్ట్ ఫిల్మ్ లకు సపోర్ట్ చేసే వారని అన్నాడు.
అయితే ఓ నెల 2000 తగ్గిందని.. దాంతో ఓ ఫ్రెండ్ తాను ఇంటికి పంపించాల్సిన 2000 తనకి ఇచ్చి ఇంట్లో కవర్ చేసాడని తెలిపాడు. ఇలా తన ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ తోనే తాను ఇంతవరకు వచ్చానని దర్శకుడు అశ్వత్ చెప్పుకొచ్చాడు. ఈ సక్సెస్ అంతా వారికే చెందుతుందని.. తనను ఎంతో ఆదరించి నీడనిచ్చిన ఫ్రెండ్స్ కు ధన్యవాదాలు తెలిపారు.