Posani krishna Murali: చంద్రబాబు, పవన్, లోకేష్, కుటుంబ సభ్యులను దూషించిన కేసులో.. సినీ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు మరో ఎదురుదెబ్బ తగలింది. విజయవాడలోని భవానీపురం స్టేషన్‌లో నమోదైన కేసుల పోసానాకి 12 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకు విజయవాడ జైల్లో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. కర్నూల్ జిల్లా జైలులో ఉన్న పోసానిని శనివారం ఉదయం విజయవాడకు తీసుకొచ్చారు.
గత ఏడాది నవంబర్ 12న జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు మేరకు.. విజయవాడ భవానీ పురం స్టేషన్లో పోసానిపై కేసు నమోదయ్యింది. దీనిపై పోలీసులు పీటీ వారెంట్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం అనుమతించింది. దీంతో కర్నూలు జైలు రిమాండ్ లో ఉన్న పోసానిని శనివారం ఉదయం.. భవానీ పురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విజయవాడ తీస్కొచ్చారు. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరు పరిచారు.
తనకు అనారోగ్య సమస్యలున్నాయని.. ఒకటికి రెండు సార్లు గుండె ఆపరేషన్లు జరిగాయనీ. గొంతు దగ్గర పక్షవాతం ఉందని. నాపై అక్రమ కేసులు పెట్టారనీ. ఒకే రకమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పు తున్నారనీ. మీరు రిమాండ్ విధించినా విధించకపోయినా తనను విజయవాడ జైలులోనే ఉంచమని పోసాని న్యాయాధికారిని కోరారు. పీటీవారంట్ అమలు చేసే వరకే తన బాధ్యతని ఆరోగ్య సమస్యలను జైలు అధికారుల దృష్టికి తీస్కెళ్లాలని.. బెయిలు కోసం.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించారు న్యాయాధికారి.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపై భవానీపురం పోలీసులు పోసానిని తిరిగి కర్నూలుకు తరలించారు. అనకాపల్లి జిల్లా పాడేరు.. పోలీసులు పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకునేందుకు విజయవాడ కోర్టుకు వచ్చారు. పోసానిని కర్నూలుకు తరలించాలని కోర్టు ఆదేశించడంతో అక్కడికి వెళ్లారు.