Beetroot Face Pack: ఎండాకాలం వచ్చేసింది. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సూర్యరశ్మికి గురికావడం వల్ల మన చర్మంపై అనేక సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. యూవీ కిరణాలు బహిర్గతం కావడం వల్ల చర్మం నల్లబడుతుంది. అయితే చాలా మంది బయట మార్కెట్లో దొరికే వివిధ బ్యూటీ ప్రొడక్ష్ట్స్ వాడుతుంటారు.
కాని వాటి వల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలన్నిటిని దూరం చేయాలంటే.. బీట్‌రూట్ ఫేస్ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
బీట్ రూట్
రోజ్ వాటర్
అలోవెరా జెల్
గ్లిజరిన్
తయారు చేసుకునే విధానం
ముందుగా ఒక బీట్ రూట్ తీసుకుని మెత్తగా మిక్సీ పట్టి, దాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టేబుల్ స్పూన్ అలోవెరాజెల్ వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని గాజు సీసాలో వేసి.. ఫ్రిజ్‌లో పెట్టి కొద్దిరోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖానికి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
బీట్‌రూట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మనందరికి తెలిసిందే.. శరీరానికి కావాల్సిన రక్తాన్ని అందించడంలో అద్బుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖం కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సమ్మర్ లో ఇలాంటివి ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.