Hair Spa Treatment at Home: తరుచూ హెయిర్ స్పా చేసుకోవడం జుట్టు కుదుళ్లు బలంగా మారడంతో పాటు.. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు సిల్కీగా మారుతుంది. హెయిర్ స్పా చేసుకోవడం వల్ల తలలో ఉన్న మురికి తొలగిపోయి.. చుండ్రును తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రతిసారి హెయిర్ స్పా చేసుకోవాలి అంటే.. పార్లర్‌కి వెళ్లాలి.. మరి పార్లర్‌కి పోవాలంటే.. కాస్త ఖర్చుతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు. అయితే మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో హెయిర్ స్పా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్దాలు
అలోవెరా
అవిసెగింజలు
కప్పు వాటర్
కొబ్బరి నూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా ఫ్రెష్ అలోవెరాలో జెల్ తీసుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టుకుని అందులో కప్పు వాటర్, అరకప్పు అవిసెగింజెలు తీసుకుని ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వేరె గిన్నెలో వడకట్టుకోవాలి. అందులో అలోవెరా జెల్, మూడు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. కొద్దిసేపు మసాజ్ చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ స్పా వల్ల జుట్టు పొడవుగా పెరుగుతుంది. అంతేకాదు.. జుట్టు సిల్కీగా, స్పూత్‌గా ఉంటుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.
కొబ్బరిపాలతో హెయిర్ స్పా..
కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలిసిందే.. అంతే కాదు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు చక్కగా పనిచేస్తుందట. కొబ్బరిపాలతో హెయిర్ స్పా చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా పొడవుగా పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జుట్టు పొడవుని బట్టి కొబ్బరి పాలు తీసుకుని దాన్ని తలకు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.