Mangoes: సమ్మర్ వచ్చేసింది.. అంటే ఈ సీజన్‌లో మామిడి పండ్లు కూడా వచ్చినట్టే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవిలో వచ్చే ఈ మామిడి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి..? వీటిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరడంలో సహాయపడతాయి. అలాగే వృధ్యాప్య ఛాయలని దూరం చేసి ముడతలను తగ్గిస్తాయి. యవ్వనంగా కనిపిస్తారు కూడా.
మామిడిలో పొటాషియం, మెగ్నీషియం, అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్త హీనత సమస్యతో బాధపడేవాళ్లకు ఈ పండు దివ్యౌషదంగా చెప్పవచ్చు.
మామిడి పండ్లను ప్రతిరోజుతింటే.. ఊబకాయ సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే ప్రొటీన్స్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఇందుకు సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా మామిడి పండ్లు చక్కగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోని బీటా కెరోటిని రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది.
మామిడి పండ్లు ఆరోగ్యానికే కాదు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా చేయడంతో పాటు, చుండ్రును కూడా తొలగించడంలో సహాయపడుతుంది. అయితే మామిడి పండ్లను డయాబెటిస్ ఉన్నవాళ్లు తినకుండా ఉంటేనే మంచిది. వడదెబ్బను నివారించడానికి మామిడి ఒక సహజ నివారణగా చెప్పవచ్చు. ఇందులో ఉండే ఐరన్ శరీరానికి శక్తిని అందిస్తుంది.