టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.
ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ ‘ఇండియానా జోనస్’ మూవీ వలె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జక్కన్న కూడా ఈ చిత్రాన్ని చాలా సీక్రెట్ గా చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఒక్క సీన్ కూడా బయటికెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Gattigane plan chesav 😱 @ssrajamouli #SSMB29 💥💥💥 pic.twitter.com/ATI1itPLr7
— 🅈🄴🅂🅄 (@Yesu715) March 9, 2025
పాన్ ఇండియా లెవెల్లో కాకుండా అంతకుమించి అన్నట్లు పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందిస్తున్నాడు. అయితే ఎంత జాగ్రత్త పడిన ఫలితం లేకపోయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చి నెట్టింట చెక్కర్లు కొడుతుంది. లీకైన వీడియోలో మహేష్ బాబును ఒక పోలీస్ ఆఫీసర్ తోసుకొని వస్తున్నాడు.
అలా వచ్చిన మహేష్ బాబు వీల్ చైర్ లో కూర్చున్న ఒక వ్యక్తి కాళ్లు ముందు కూర్చుంటాడు. అయితే ఆ వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి ఎవరో తెలియలేదు. కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం వేల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఈ వీడియో లీక్ చేసిన వారిపై దర్శకుడు రాజమౌళి తో పాటు మూవీ యూనిట్ కూడా చర్యలు తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసి ఓవైపు అభిమానులు ఫుల్ కుష్ అవుతుండగా.. మరి కొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిత్ర యూనిట్ కి కోరుతున్నారు.