Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్నారు. జగ్గారెడ్డి రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. చాలా సార్లు సెన్షేషనల్ కామెంట్స్ చేస్తూ.. ఢిపరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. సాధారణంగా సినిమాల్లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వతా రాజకీయాలపై దృష్టిపెడుతుంటారు. ఎన్టీఆర్ నుంచి మొదలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి చూపించారు కూడా.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న జగ్గారెడ్డి సినిమాల్లోకి అడుగుపెడతానని తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఒక ప్రేమ కథ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. నిజ జీవిత పాత్రనే పోషింస్తానని చెప్పారు. జగ్గారెడ్డి పేరుతోనే సినిమా ఉంటుందని అన్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చెబుతానని అన్నారాయన.
ఈ ఉగాదికి కథ విని.. వచ్చే ఉగాదికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారాయన. సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ సీనియర్లతో మాట్లాడి సినిమా మొదలు పెడతానని తెలిపారు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమా రిలీజ్ చేస్తామన్నారాయన.
ఇక ఈ సినిమాను ‘జగ్గారెడ్డి’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వార్ ఆప్ లవ్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమాకి వడ్డి రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అందులో ప్రేమజంట, సీరియస్ లుక్‌లో జగ్గారెడ్డి కనిపిస్తున్నారు. చూస్తుంటే.. పవర్‌ఫుల్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో మూవీమేకర్స్ వెల్లడించనున్నారు. రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న జగ్గారెడ్డి నటుడిగా ప్రశంసలు అందుకుటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.