Best Serum For Hair Growth: పొడవాటి జుట్టు కావాలా ఒక్కసారి ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి..

Best Serum For Hair Growth

Best Serum For Hair Growth: ప్రతి ఒక్కరికి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్‌ఫాల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడికి గురవ్వడం, ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అయితే చాలా మంది జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ సీరమ్ లు, షాంపులు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల ఫలితం ఉండకపోవచ్చు.

జుట్టు రాలిపోకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి. తరుచూ వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఇంట్లో దొరికే నాచురల్ పదార్ధాలతో హెయిర్ సీరమ్‌లు తయారు చేసుకున్నారంటే.. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
అవిసెగింజలు
నీళ్లు
మెంతులు
బియ్యం

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించే కడాయి పెట్టుకుని అందులో గ్లాసు వాటర్, నానబెట్టుకున్న మెంతులు కప్పు, అవిసె గింజలు అరకప్పు, బియ్యం అరకప్పు వేసి బాగా జిగటగా వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోండి. ఇప్పుడు ఈ సీరమ్‌ను తలకు అప్లై చేసి అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఈ సీరమ్ కొద్దిరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.

జుట్టు పెరుగుదలకు ఈ హెయిర్ సీరమ్ కూడా ట్రై చేయండి..
కావాల్సిన పదార్దాలు
ఉల్లిపాయ రసం
బియ్యం నీళ్లు
విటమిన్ ఇ క్యాప్సూల్స్

తయారు చేసుకునే విధానం
గంటపాటు బియ్యంను నీటిలో నానబెట్టి ఆ వాటర్‌ను వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. అందులో ఉల్లిపాయ రసం, విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే సరిపోతుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

 

తరవాత కథనం