Sitting Risks: ప్రస్తుతం జీవనశైలిలో గంటలతరబడి వర్క్ చేయడం కామన్ అయిపోయింది. ఆఫీస్ అయినా, ఇంట్లో అయినా ప్రజలు 6-8 గంటలు నిరంతరం కూర్చుని ల్యాప్‌ట్యాప్, ముబైల్‌తో బిజీగా ఉంటున్నారు. అయితే ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజుకు ఆరు, ఏడు గంటల పైగా కూర్చుని పనిచేస్తే.. ఊబకాయం, గుండె సమస్యలు, నడుమునొప్పి వంటి సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే.. శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.? దానిని ఎలా నివారించాలి.? ఆరోగ్య నిపుణులు ఏంచెబుతున్నారో తెలుసుకోండి.
గంటల తరబడి ఒకచోటే కూర్చుంటే.. శరీరంలో కేలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుందట. కడుపు, నడుము చుట్టూ కొవ్వు పెరుగుపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలు ప్రమాదం
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు 40 శాతం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. అంతే కాదు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందట. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
డయాబెటిస్ వచ్చే అవకాశం
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
వెన్నునొప్పి, మెడనొప్పి వచ్చే అవకాశం
నిరంతరం కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వెన్నునొప్పి, నడుము నొప్పి, మెడ బిగుసుకుపోవడానికి కారణమవుతుంది. ఎక్కువసేపు తప్పు స్థితిలో కూర్చోవడం వల్ల కూడా వెన్నెముక సమస్యలు వస్తాయి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది.
⦿ ఈ ప్రమాదాలను నివారించడానికి
⦿ ప్రతి 30-40 నిమిషాలకు విరామం తీసుకోండి. కాసేపు నడవండి. తేలికపాటి వ్యాయామం చెయ్యండి.
⦿ నిలబడి పనిచేయడానికి ప్రయత్నించండి
⦿ లిఫ్ట్ కు బదులు నడవడానికి ట్రై చేయండి. ఫీసులో లేదా ఇంట్లో నడుస్తూ కొన్ని పనులు చేసేలా చూసుకోండి..
⦿ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చెయ్యండి.