ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్‌ వైట్ సూట్స్‌ ఎందుకు ధరిస్తారంటే?

ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్ జట్టు ఈ ట్రోఫీ అందుకోవడం గమనారం. అంతేకాకుండా ఆఖరిపోరులో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకొని టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే న్యూజిలాండ్తో ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్స్ అందరూ వైట్ బ్లేజర్స్ ధరించిన విషయం తెలిసిందే. అయితే ఇలా ధరించడం వెనక ఓ ప్రాధాన్యత ఉందని ఐసిసి తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ప్లేయర్లకు మాత్రమే తెల్ల కోట్ ఇవ్వడానికి ఓ కారణం ఉందని పేర్కొంది.

వైట్ బ్లేజర్ ఆటగాళ్ల గొప్పదనాన్ని అలాగే దృఢ సంకల్పాన్ని తెలిపే “గౌరవ బ్యాడ్జ్” అని ఐసీసీ తెలిపింది. ఈ వైట్ షూట్ ఛాంపియన్లు అలంకరించే గౌరవ చిహ్నంగా చెప్పుకొచ్చింది. ట్రోఫీ కోసం జట్టుపడ్డ కృషి, కష్టం తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ఈ బ్లేజర్స్ తెలియజేస్తాయని పేర్కొంది. అదే సమయంలో టోర్నీలో పాల్గొనే జట్లు ట్రోఫి కోసమే కాకుండా వైట్ షూట్ కోసం కూడా పోటీ పడతాయని చెప్పుకొచ్చింది.

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత వైట్ షూట్ ధరించడం ఇదేమి మొదటిసారి కాదు. ఇది 2009 నుంచి జరుగుతోంది. ఆ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. అక్కడ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు గెలిచి వైట్ షూట్లను ధరించింది. ఆ తర్వాత ధోని సారధ్యంలో 2013లో టీమ్ ఇండియా ప్లేయర్లు వైట్ బ్లేజర్లను ధరించారు.

2017 లో కూడా అలానే చేశారు. ఇక ఇప్పుడు 2025లో అదే సాంప్రదాయాన్ని ఐసిసి ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సాంప్రదాయం కేవలం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో మాత్రమే కనిపిస్తుంది. టి20, వన్డే వరల్డ్ కప్ లలో కనిపించదు.

తరవాత కథనం