Bam Bam Bhole Song Out: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా సికిందర్. దక్షిణాది స్టార్ డైరక్టర్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మాణంలో నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ కథానాయికలు.
ఈ సినిమాను రంజాన్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో సత్యరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు విశేష ఆదరణ పొందింది. అయితే ఈ టీజర్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి.
విజయ్ కథానాయుకుడిగా నటించిన సర్కారు సినిమా రీమేక్ అని, ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ నుంచి స్ఫూర్తి పొంది, సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కొన్ని మార్పులు చేశారని ఇలా వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై డైరక్టర్ స్పందించారు. ఈ సినిమా పూర్తిగా కొత్త కథ అని సికిందర్‌కి సంబంధించి ప్రతి సీన్, ఫ్రేమ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దామని ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఇది ఏ మూవీ రీమోక్ కానీ, స్ఫూర్తి పొంది ఈ సినిమా తీయలేదని స్పష్టత ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి భం భం భోళే సాంగ్‌ను హోళీ సందర్భంగా చిత్ర బృందం రిలీజ్ చేశారు. సల్మాన్, రష్మిక స్టెప్పులు అలరిస్తున్నాయి. ఈ సాంగ్‌లో కథానాయిక కాజల్ ఇందులో తళుక్కున మెరిశారు.