Sai Pallavi: సోదరుడి వివాహంలో డాన్స్‌తో ఇరగదీసిన సాయిపల్లవి.. వీడియో వైరల్

Sai Pallavi

Sai Pallavi: సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవలరం లేదు. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీలో, బంధువల ఇంట జరిగే వేడుకలల్లో సందడి చేస్తోంది సాయిపల్లవి. ఇటీవల చెల్లి పెళ్లి సందర్భంగా దగ్గరుండి చూసుకుంది. అంతేకాదు మెహందీ, పెళ్లి వేడుకలో తన డాన్స్ తో అలరించిన సంగతి తెలిసిందే.. అప్పట్లో ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా తన తమ్ముడి వివాహ వేడుకలో సాయిపల్లవి తన డాన్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. నీలం రంగు చీర కట్టుకుని ఆమె డాన్ చేస్తూ కనిపించింది. అయితే ఈ వేడుక ఎక్కడ జరిగిందని వివరాలు రాలేదు. దగ్గరి బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అమరన్ సినిమా, నాగచైతన్యకు జోడీగా తండేల్ బాక్సీఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది. ఏక్ దిన్, రామాయణ సినిమాల్లో నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ లో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి కనిపించనుంది. రావణాశురుడి పాత్రలో యశ్ నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2026లో, రెండోది 2027లో విడుదల కానుంది.

తరవాత కథనం