Benefits of Lemon Water: నిమ్మకాయల్లో ఎన్నోరకాల ఔషదగుణాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవాళ్లు నిమ్మరసం తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా నిమ్మరసం తీసుకోవచ్చు. విటమిన్ సి తో పాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మవల్ల మనకు లభిస్తాయి. నిమ్మకాయ వల్ల శరీరానికి కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయలు మనదేశంలో విరివిగా లభ్యమవుతాయి. నిమ్మరసాన్ని వంటల్లో రుచికోసం ఎక్కువగా వాడుతుంటారు. నిమ్మకాయల్లో అనేక రకాల ఔషద గుణాలు కూడా దాగి ఉన్నాయి. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. మనం తిన్న ఆహారం మరగడానికి జీర్ణాశయంలోని ఆమ్లాలు తోడ్పడతాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్ది వీటి స్థాయిలు తగ్గుతూ ఉంటాయి. నిమ్మరసంలోని ఆమ్లాలు వీటికి చేదోడు వాదోడుగా నిలిచి ఆహారం జీర్ణం కావడానికి దోహదం చేస్తాయి. మనలో చాలా మంది తగినంత నీరు తాగరు. దీంతో శరీరంలో నీటి శాతం పడిపోతుంది. రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటే.. శరీరంలో నీటిశాతం పడిపోకుండా నివారించుకోవచ్చు.
నిమ్మకాయలో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు.. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాదు గాయాలు త్వరగా మానడానికి తోడ్పడతుంది. ఇక నిమ్మరసంలోని ఫైటో న్యూట్రియంట్లు యాంటీ ఆక్సిడెంట్లు గాను పనిచేస్తాయి. ఇవి విశృంగల కణాల మూలంగా తలెత్తే అనార్ధాల నుంచి కాపాడతాయి. నిమ్మరసంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది లేకపోతే శరీరం సరిగ్గా పనిచేయదు. నాడులు కండరాల మధ్య సమాచారానికి ఇది అత్యవసరం. అన్ని కణాలకు పోషకాలు అందడానికి, వ్యర్ధాలను బయటకు పంపడానికి తోడ్పడతాయి.
నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్దకం బరువు తగ్గిస్తారు. ఉదయం వేళ నిమ్మరసంలో తేనె కలిపి తాగితే శరీరంలోని నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక కొవ్వులను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. గొంతుకు వచ్చే ఇన్పెక్షన్లను నిమ్మ మంచి ఔషదం. నిమ్మరసంలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతులో మంటలను తగ్గిస్తాయి తల తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు శరీరంలో లవణాలు బాగా తగ్గినప్పుడు నిమ్మరసం ఇస్తే త్వరగా కోలుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు నిమ్మరసంతో పళ్లరసం ఇస్తే ఆ తీవ్రత త్వరగా తగ్గిపోతుంది.