Liver Health: ఈ ఆహారాలను తగ్గించుకోండి- మీ లివర్‌ని కాపాడుకోండి..

Liver Health

Liver Health: మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయం కాలేయం. ఇలాంటి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం వల్ల మిగతా శరీరా అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలా కాకుండా కాలేయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఇబ్బందులకు గురికావడం తప్పదు. మరి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఏం చేయాలి. ఎలాంటి ఆహారాలను తగ్గించుకోవడం ద్వార లివర్‌ను కాపోడుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో ఉన్నా అవయవాలన్నిట్లోకెల్లా లివర్ పెద్దదైన అవయవం. రక్తంలో ఉన్న విష పదార్ధాలను తొలగించడం, శరీరానికి అవసరమైన శక్తిని అందించడం వంటి ఎన్నో పనులను నిత్యం చేస్తూ ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనం తినే పదార్ధాలను, తాగే పానీయాలను శక్తి రూపంలోకి మారుస్తుంది. రక్తం గడ్డకట్టడంలోనూ, కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం సుమారు 500 రకాల పనులను చేస్తుంది. కాలేయం సక్రమంగా పనిచేయకపోతే శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా.. అలాగే కొన్ని ఆహార పదార్ధాలను దూరంగా పెట్టడం ద్వారా సాధ్యపడుతుందని గుర్తించుకోవాలి.

మనం తినే ఆహారంలో ముఖ్యంగా చక్కెరలు ఎక్కువగా కాలేయంపై ప్రభావం చూపుతాయి. చక్కెరలను ఎంత తక్కువగా తింటామో మన లివర్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీర బరువు ఎక్కువగా పెరుగుతుందంటే.. కాలేయం కణాలు ఎక్కువగా పెరిగేందుకు దోహదపడతాయి. ఇది నాన్ ఆల్కాహాలిక్ ఫాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది. ఫలితంగా కాలేయం వాపుకు గురై సిరోసిస్‌కు దారితీస్తుంది. దీనికి గాను డైట్ పాటిస్తూ.. వ్యాయామాలు చేయడం చాలా మంచిదని గుర్తించుకోవాలి.

శరీరానికి విటమిన్ ఎ కావాల్సి ఉంటుంది. ఎ విటమిన్‌ను మొక్కలు, తాజా కూరగాయలు, పండ్ల నుంచి పొందవచ్చు. అయితే అదేపనిగా సప్లిమెంట్ల నుంచి విటమిన్ ఎ లభించేలా చేయడం అంత మంచిదికాదని వైద్యులు సూచిస్తున్నారు. సప్లిమెంట్ల ద్వారా తీసుకునే విటమిన్ ఎ కాలేయ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. శీతల పానీయాలు తాగే వ్యక్తులు నాన్ ఆల్కాహాలిక్ లివర్ డిసీజ్ భారిన పడే ఛాన్స్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాలేయంపై కొన్ని రకాల ఔషదాలు తీవ్రప్రభావం చూపుతూయి. అలాంటి వాటిల్లో వెన్నునొప్పి, తలనొప్పి, జలుబు వచ్చినప్పుడు వాడే అసిటోమైనసిన్ చేరుతుంది. ఈ ఔషదాన్ని ఎక్కువగా వాడినట్లైతే కాలేయం  దెబ్బతినే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

తరవాత కథనం