మన శరీరంలో ప్రోటీన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని వినియోగం వల్ల కండరాలు, ఎముకలు, దంతాలు బలపడతాయి. అంతేకాకుండా ఏదైనా తీవ్రమైన గాయం అయితే.. దాని నుండి కోలుకోవడంలో ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఊబకాయాన్ని కూడా నివారిస్తుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సిఫార్సు చేస్తారు.
శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే రోజంతా అలసిపోతారు. శరీరం అలాగే కీళ్లలో నొప్పిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు, గోళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో అనేక రకాల ఎంజైమ్‌లు, రసాయనాలు, హార్మోన్లను తయారు చేయడంలో ప్రోటీన్ చాలా సహాయపడుతుంది. కాబట్టి ప్రోటీన్ శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యానికి ప్రోటీన్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు చాలా ముఖ్యమైనవి. రోగనిరోధక వ్యవస్థ T- కణాలు, B- కణాలు, ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి.
ఫ్యాట్ బర్న్
శరీరంలో మెటబాలిజం పెంచడానికి ప్రొటీన్ పనిచేస్తుంది. రోజంతా చాలా కేలరీలు బర్న్ చేస్తే, మీరు సరైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి.
ఎనర్జీ బూస్టర్
శక్తిని పెంచడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. అలాగే, బరువు తగ్గడానికి కేలరీలను తగ్గిస్తే.. శరీరం ప్రోటీన్‌తో సమృద్ధిగా శక్తిని పొందుతుంది.
గాయాలు మటుమాయం
ప్రొటీన్ అనేది శరీరంలోని కండరాలకు సహాయపడుతుంది. దాని ద్వారా ప్రోటీన్ శరీరంలోని గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణ
అధిక రక్తపోటు అనేది గుండెపోటు, మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది. దీని ద్వారా శరీరంలోని ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మెరిసేటి చర్మం కోసం
చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. ఇది కాకుండా.. ప్రోటీన్ చర్మాన్ని బలపరుస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
జుట్టు కోసం ప్రోటీన్
ప్రొటీన్ జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ప్రొటీన్లు కూడా జుట్టు పగలకుండా కాపాడతాయి.