White Hair Tips: తెల్లజుట్టును నల్లగా మార్చే.. బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే..

White Hair Tip

White Hair Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా.. ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య తెల్లజుట్టు రావడం. బయట కాలుష్యం వల్ల గానీ, దుమ్మూ, ధూళి, పోషకాహారం తినకపోవడం వల్ల జుట్టు నల్లగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు వివిధ రకాల హెన్నాలు, హెయిర్ డైలు, షాంపులు ఉపయోగిస్తుంటారు.

ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టుకు హాని కలిగే ప్రమాదం ఉంది. పైగా వీటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన ఇంట్లోనే దొరికే నాచురల్ పదార్ధాలతో ఒక్కసారి హెయిర్ మాస్క్ పెట్టుకున్నారంటే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సినపదార్ధాలు
ఉసిరి
కొబ్బరి నూనె
బ్లాక్ సీడ్స్
మెంతులు
కరివేపాకు
తయారుచేసుకునే విధానం
మందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో ఉసిరి ముక్కలు, రెండు కప్పుల కొబ్బరి నూనె, మెంతులు, బ్లాక్ సీడ్స్, కరివేపాకు వేసి బాగా నల్లగా మారేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని గిన్నెలో వడకట్టుకుని జుట్టు కుదుళ్లకు పట్టించండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు జుట్టుకూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం