Chhaava Movie: బాహుబలి రికార్డులు బ్రేక్.. ఛావా హైక్లాస్ కలెెక్షన్ల వర్షం!

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన “ఛావా” మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. కనివిని ఎరుగని రేంజ్ లో కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సినీప్రియుల్ని ఎంతగానో అలరించింది.

విక్కీ కౌశల్ కెరియర్ లోనే ఈ సినిమా ఆల్ టైం హిట్టుగా నిలిచింది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ప్రభాస్ అండ్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ సినిమా హిందీలో రూ.510.99 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆ కలెక్షన్లను చావా మూవీ బద్దలు కొట్టింది. ఇప్పటివరకు హిందీలో చావా మూవీ కి రూ.516.8 కోట్లు వచ్చాయి. ఇంకా ఈ మూవీ థియేటర్ లోనే ప్రేక్షకుల సందడి మధ్య రన్ అవుతుంది. ఇప్పటికే సినీ ప్రియులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.

ఇక ఇటీవలే తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

తరవాత కథనం