యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు.
ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీసి అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన “క” సినిమాతో ఊహించని హిట్ అందుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. కలెక్షన్ వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో అభిమానుల్ని అలరించేందుకు కిరణ్ అబ్బవరం రెడీ అయ్యాడు.
అతడు చేస్తున్న మరో కొత్త సినిమా దిల్ రూబా. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఇది 10వ సినిమాగా రాబోతుంది. విశ్వ కరుణ్ ఈ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సెవెన్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ సరిగమ నిర్మాణ సంస్థ అయిన యూడ్లి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సినీ ప్రియులని ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ చూసేందుకు వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. క సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రూబా ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ సిద్ధమైంది.
మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇందులో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా వార్త బయటకు వచ్చింది. కిరణ్ అబ్బవరం అండ్ అతడి స్నేహితులు కలిసి నిన్న ఈ చిత్రాన్ని చూసినట్లు తెలిసింది. దీంతో అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి 13న ఈ మూవీ ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంటుందో.