వేసవికాలం వచ్చేసింది. ఉదయం కాగానే ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావడానికి ప్రజలు వనికి పోతున్నారు. ఎండ తాపానికి గురై అనారోగ్య బారిన పడుతున్నారు. నీరసంతో అల్లాడిపోతున్నారు. అందువల్లనే వేసవికాలంలో పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా తీసుకోకపోతే బాడీ డీహైడ్రేషన్కు గురై కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వేసవిలో కొన్ని పదార్థాలను ఎక్కువగా తినకూడదని.. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్
వేసవిలో డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జీడిపప్పు, పిస్తా, బాదాం వంటి పదార్థాలను ఎక్కువగా తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇవి తినడం వల్ల బాడీ వేడి చేస్తుందని అంటున్నారు. సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా వేడిగా ఉంటుంది. అందువల్ల ఈ పదార్థాలను తీసుకుంటే బాడీకి మరింత ఉష్ణోగ్రత పెరుగుతుందని.. దానివల్ల శరీరం డిహైడ్రేషన్ గురవుతుందని.. అనంతరం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
స్పైసీ ఫుడ్స్
వేసవికాలంలో స్పైసీ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కారం, మసాలా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. వేసవిలో స్పైసి ఫుడ్ తినడం వల్ల బాడీలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు చికాకు కలిగిస్తుంది.
వేయించిన పదార్థాలు
వేసవికాలంలో వేయించిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇలా తినడం వల్ల శరీరానికి ఎలాంటి శక్తి ఉండదు. దీనివల్ల బయటికి వెళ్లేటప్పుడు ఎండ తీవ్రతకు గురై కిందపడిపోయే అవకాశం ఉంటుంది.
కాఫీ
కాఫీని వేసవికాలంలో ఎక్కువగా తీసుకోకూడదు. ఈ కాలంలో కాఫీని ఎక్కువగా తాగితే బాడీకి వేడి చేస్తుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే రోజులో ఒకటి రెండు సార్లు తాగితే పర్వాలేదు. ఎక్కువసార్లు తాగకూడదు.