Mufasa: హాలీవుడ్ సినిమాలకు మనదగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు చాలా తెలుగు డబ్బింగ్‌లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలతో పోటీగా హాలీవుడ్ మూవీస్ విడుదల అవుతున్నాయి. అంతే కాదు తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు మన హీరోలతో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన అవైజర్స్ మూవీస్‌లో థావోస్ పాత్రకు హీరో రానా వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన లయన్ కింగ్ సినిమాల్లో చాలా మంది హీరోల వాయిస్‌లు ఇచ్చారు. సింబా పాత్రకు నాని, టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం వాయిస్ ఇచ్చారు. ఇక రీసెంట్‌గా వచ్చిన ముఫాసా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు.
ఓ రాజ్యం.. రాజు.. యువరాజు.. అక్కడ సింహాసనం కోసం పోరాటాలు.. ఇవన్ని చాలా చిత్రాల్లో మనం చూసే ఉంటాము. ఇలాంటి కథతో రిలీజ్ అయిన సినిమా ముఫాసా.. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇంగ్లీష్ తో పాటు పలు భాషల్లో ఈ మూవీని నిర్మించారు.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ వేదికగా మార్చి 26న స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని ఓటీటీ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సినిమా 2029లో విడుదలైన ది లయన్ కింగ్ కు సీక్వెల్‌గా వచ్చిన మూవీ ఇది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలోకి రాబోతుంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి.