Kartik Aaryan: బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. కార్తీక్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో శ్రీలీల కనిపించడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ ఈవెంట్‌లో హీరో తల్లిని ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో తెలియజేస్తూ.. ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐఫా వేడుకలో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలు గురించి ప్రశ్నించగా.. వైద్యురాలు తమ ఇంట్లో కోడలిగా రావాలని మేమంతా కోరుకుంటున్నామని అమె తెలిపింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే.. చాలా సందర్భాలలో తన చదువుతో పాటు కెరీర్ లోను కొనసాగుతుండటం చాలా ఆనందంగా ఉందని తలిపిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు హీరో తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. శ్రీలీలను ఉద్దేశించే ఆమె మాట్లాడారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక శ్రీలీల ఓ వైపు సినిమాల్లోనూ అలరిస్తూనే.. మరో వైపు పర్శనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. ముందుకు దూసుకుపోతుంది. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తోంది. మరోవైపు నితిన్‌తో రాబిన్ హుడ్ మూవీలో నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. శ్రీలీల తెలుగులోనే కాదు బాలీవుడ్ లోను అలరిస్తోంది. హీరో కార్తిక్ ఆర్యన్‌తో జోడీగా.. డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా ఉండనున్నట్లు టాక్.