Papaya Leaf Juice Benefits: బొప్పాయి మన పెరట్లో ఉంటే.. మన దగ్గర ఓ పెద్ద ఔషద బాటిల్ ఉన్నట్లే.. ఎందుకంటే.. బొప్పాయి ఆకుల నిండా ఔషద గుణాలే.. అందుకే ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడతారు. మలేరియా నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాల్ని బొప్పాయి ఆకులు నయం చేయగలవు. ఇంటి దగ్గర బొప్పాయి ఆకులను ఇంటి దగ్గర బొప్పాయి మొక్క పుడితే చాలా ఆనందపడండి. దాన్ని జాగ్రత్తగా పెంచండి. పెద్దయ్యాక ఆకులను ఇలా వాడేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.
చుండ్రు, జుట్టు రాలిపోవడం, తలలో దురద అలాంటివి ఏ సమస్యలున్న బొప్పాయి ఆకుల రసం రాసుకోండి. జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం వంటి సమస్యలకు చాలాబాగా పనిస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా. షాంపూ కండీషనర్‌గా ఇది పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల రసం మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలదు. తద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్బుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తెలిపాయి. బొప్పాయి ఆకులో ఫెనోలిక్ అనే కాంపౌండ్, పపాయి, ఆల్కనైడ్ అనే పోషకాలు ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ రాకుండా కూడా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలను సరిచేయడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది.
శరీరంలో హార్మోన్లను క్రమబద్దీకరిస్తుంది. కొంతమందికి తిన్న ఆహారం సరిగ్గా అరగదు. పొట్టంతా పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. వాళ్లు బొప్పాయి రసం టేబుల్ స్పూన్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ వస్తే.. ఇంకేం ఆలోచించకుండా పూటకు ఒకసారి బొప్పాయి రసాన్ని ఓ టేబుల్ స్పూన్ ఇచ్చేయడమే. దెబ్బకు డెంగ్యూ పారిపోతుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, ఇ, కాల్షియం ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో విష వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది.