Korean Glass Skin: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి అందంపై శ్రద్ధ పెరిగింది. ఒకప్పుడు జనాలకు అందంపై ఇంత ధ్యాస ఉండేదు కాదు. కానీ మారుతున్న టెక్నాలజీ కారణంగా అందంపై ఆసక్తి పెరిగింది. వయసుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంసలో బయట మార్కెట్లో కాస్మోటిక్ వాడకం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొరియన్ లాంటి సౌందర్యం గురించి ఎక్కువగా చూపిస్తున్నారు. కొరియన్స్ స్కిన్ ఎంతో వైట్‌గా గ్లాసీ లుక్‌తో కనిపిస్తున్నారు. దీంతో అలా కనిపించేందుకు చాలా మంది ట్రై చేస్తున్నారు. మీకు కూడా ఇలాంటి అందం కావాలంటే.. ఒకసారి ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు..
రైస్ వాటర్
అలోవెరా జెల్
కొబ్బరి నూనె
విటమిన్ ఇ క్యాప్సూల్స్
తయారుచేసుకునే విధానం
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు చేబుల్ స్పూన్ అలోవెరాజెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రైస్ వాటర్ కలిపి బాగామిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని చిన్న గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ముఖానికి పెట్టుకుని అలగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతంగా, గ్లాసీగా ఉండేలా చేస్తుందు. అంతే కాదు ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి.
తేనె – పెరుగు ప్యాక్:
చర్మ అందాన్ని పెంచడంలో తేనె, పెరుగు రెండూ చక్కగా పని చేస్తాయి. ఇందుకోసం చిన్న గిన్నె తీసుకుని అందులో పెరుగు, టేబుల్ స్పూన్ తేనె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. అంతే ఇలా ప్రతి రోజు చేసి చూడండి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.