Multani Mitti Face Packs : అందమైన ముఖం కావాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. ముఖం కాంతివంతంగా, మెరిసేలా కనిపించాలని కోరుకుంటారు. కానీ బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చర్మంపై అనేక రకాల సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. దీనికితోడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఇక ఎండ వల్ల స్కిన్ డల్‌గా మారిపోవడం, కమిలిపోవడం, ముఖంపై మురికి చేరిపోవడం వీటివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వచ్చేస్తుంటాయి. ఇందుకోసం చాలా మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ వేలకు వేలు ఖర్చు చేసి కొంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి కొద్దిరోజులు మాత్రమే పనిచేస్తాయి. శాశ్వతంగా ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. ఉత్తమ ఫలితం ఉంటుంది.
ముల్తానీమిట్టి చర్మ సౌందర్యానికి చక్కగా పనిచేస్తుంది. ముఖాన్ని గ్లోయింగా, అందంగా మార్చేందుకు సహాయం చేస్తుంది. ఇందుకోసం ముల్తానీమిట్టితో ఈ ఫేస్ ప్యాక్‌లు ముఖానికి అప్లై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్తానీమిట్టి పచ్చి పాలు ఫేస్ ప్యాక్
ముందుగా ముల్తానీమిట్టిని చిన్న బౌల్‌లో తీసుకుని.. రెండు టేబుల్ స్పూన్ పచ్చి పాలు కలిపి ముఖాన్ని అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. ముఖంపై మురికి తొలగిపోయి, కాంతివంతంగా మెరుస్తుంది.
ముల్తానీమిట్టి, బియ్యం పిండితో ఫేస్ ప్యాక్
చిన్న గన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీమిట్టి, రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖానికి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మాడు సార్లు చేస్తే.. ముఖంపై మృతకణాలు, మచ్చలు తొలగిపోయి అందంగా కనిపిస్తారు.
ముల్తానీమిట్టి, తేనె, పసుపు ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీమిట్టి, తేనె, చిటికెడు పసుపు కలిపి ఫేస్ కి అప్లై చేసి .. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి . ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం మిల మిల మెరిసిపోతుంది.
ముల్తానీమిట్టి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీమిట్టి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత చల్లటి నీటితో ఫేస్‌ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. ముఖంపై మచ్చలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్‌ను తొలగించి కాంతివంతంగా, గ్లో గా కనిపించేలా చేస్తుంది.