అక్కినేని అఖిల్ గత రెండు సంవత్సరాల క్రితం నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఏజెంట్ మూవీ డిజాస్టర్ తో మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ సినిమా ఏంటో.. సినిమా దర్శకుడు ఎవరు..?.. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు?.. ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని అఖిల్ కి గత రెండేళ్ల క్రితం బ్యాడ్ టైం నడిచింది. చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మజ్ను, ఏజెంట్ వంటి సినిమాలు తీశాడు. ఇందులో ఏ ఒక్క సినిమా కూడా అఖిల్ ను కంబ్యాక్ చేయలేదు. ముఖ్యంగా అఖిల్ కెరీర్లో ఏజెంట్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
ఎన్నో అంచనాల మధ్య.. భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అఖిల్ కు మంచి కంబ్యాక్ ఇస్తుందని అంత భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత నుంచి అఖిల్ మళ్లీ కనిపించలేదు.
ఇప్పటికే దాదాపు రెండేళ్లు గడుస్తుంది. అతడి నెక్స్ట్ సినిమా ఏంటి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ తన ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఇటీవలే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిసింది.
ఈ మూవీ షూటింగ్ కూడా రేపటి నుంచి అంటే మార్చి 14 నుంచి హైదరాబాదులో ప్రారంభం కానున్నట్టు సమాచారం. చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలిసింది. కాగా ఇది అఖిల్ కెరియర్లో 6వ సినిమాగా రానుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నట్లు తెలిసింది.
ఈ చిత్రానికి టైటిల్ ని కూడా పరిశీలించారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “లెనిన్ ” అనే టైటిల్ను పరిశీలనలో ఉంచారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.