ఇటీవల icc ఛాంపియన్ ట్రోఫీ అత్యంత రసవత్తరంగా సాగింది. ఈ ట్రోఫీనీ భారత్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్తో ఫైనల్ పోరులో ఘన విజయం సాధించి టోఫీని దక్కించుకుంది. అయితే ఈ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 83 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
ఎప్పుడూ దూకుడుగా ఆడే రోహిత్.. ఈ మ్యాచ్లో స్లోగా ఆడి టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో రోహిత్ ఐసిసి ర్యాంకింగ్స్ లో 3వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ మేరకు అతడు రెండు ర్యాంకులను మెరుగుపరుచుకున్నాడు. ఇక ఈ టోర్నీలో 218 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఒక స్థానం నష్టపోయి ఐదవ స్తానానికి పడిపోయాడు.
ఇక భారత్ ఓపెనర్ శుభమన్ గిల్ నెంబర్ వన్ వన్డే బ్యాటర్ గా నిలిచాడు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. అతడు ఎప్పటిలానే ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ 6 స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు.
అదే సమయంలో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తీక్షన మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే భారత్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. అదే జాబితాలో టాప్ టెన్ లో జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆఫ్గనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా నిలిచాడు.