Rose Water For Face: అందమైన ముఖం ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు తమ చర్మం కాంతివంతంగా, మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ కాలంలో చర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందే.. లేదంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాలుష్య కారకాల వల్ల చర్మం, దుమ్మూ, ధూళి, చర్మం పొడిబారిపోవడం, మొటిమలు, ఎండ వల్ల చర్మం కమిలిపోవడం, మురికిగా మారడం వంటి సమస్యలు వస్తాయి.
చర్మ రక్షణ కోసం రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వలన, ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు అద్బుతంగా పనిచేస్తుంది. రోజ్ వాటర్‌ను శతాబ్ధాలుగా చర్మ సౌందర్యానికి ఉపయోగుస్తున్నారు. రోజ్ వాటర్ ముఖాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో చక్కగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
రోజ్ వాటర్
అలోవెరా జెల్
కొబ్బరి నూనె
విటమిన్ ఇ క్యాప్సూల్స్
తయారు చేసుకునే విధానం
ముందుగా చిన్నె గిన్నె తీసుకుని అందులో రోజ్ వాటర్, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇది ముఖానికి సహజ మెరుపును అందించడంతో పాటు, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. రోజ్ వాటర్ వృద్ధాప్య సాంకేతాలను నివారిస్తుంది.
అంతే కాదు రోజ్ వాటర్ సహజ యాంటీ ఏజింగ్ రెమెడీగా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేసి ఆక్సీకరణ ఒత్తిడిని తటస్థీకరించి ముడతలు, మచ్చలును తొలగించి యవ్వనంగా ఉండేలా సహాయపడతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.