Hair Care Tips: జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి..!

Hair Care Tips

Hair Care Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేక అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు రాలే సమస్యలతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బయట దుమ్మూ, ధూళి, కాలుష్యం, ఒంట్లో ఇతర అనారోగ్య సమస్యలు, ఇంట్లో, ఆఫీస్‌లో పని ఒత్తిడి ఇలా జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇందుకోసం రకరకాల హెయిర్ ఆయిల్స్, హెన్నాలు, వివిధ రకాల షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి కొంతకాలమే పనిచేస్తాయి. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో అనేక చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో నాచురల్ పదార్దాలతో తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఊడిపోకుండా ఉంచడంతో పాటు.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్దాలు
పెరుగు
కాఫీపొడి
తేనె
కొబ్బరినూనె
విటమిన్ ఇ క్యాప్సూల్స్

తయారు చేసుకునే విధానం
ముందుగా చిన్న బౌల్ తీసుకని అందులో పావుకప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్, రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి, గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి క్రమంగా పొడవుగా, ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది. వీటివల్ల జుట్టుకు ఎలాంటి హానీ కలగదు. అంతే కాదు తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది. చుండ్రు సమస్యలను తొలగిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం