pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హరిహర వీరమల్లు వాయిదా.. కొత్త పోస్టర్ రిలీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలతో, మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం కాకముందు సంతకాలు చేసిన సినిమాలను వరుసగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నటిస్తున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా పట్టాలెక్కి ఎన్నో నెలలు గడిచింది.

కానీ ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇటీవల విడుదలైన ఆ రెండు సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.

కనివిని ఎరుగని వ్యూస్ తో అదరగొట్టేసాయి. ఇక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నోసార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తంగా ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో తెలిపారు. అయితే ఇవాళ హోలీ సందర్భంగా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు.

ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలిపారు. ఈ మేరకు హోలీ సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ సహా ఇతర నటులు గుర్రాలపై కూర్చుని ఉన్నారు. అందులోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. గతంలో మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.

కొత్త డేట్ ప్రకారం.. హరిహర వీరమల్లు సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

తరవాత కథనం