గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లో 16వ చిత్రాన్ని.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత మూడేళ్లు ఒకే సినిమాకు కేటాయించాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేశాడు. ఇది భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ ఆర్సి 16 సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.
దర్శకుడు బుచ్చిబాబు సైతం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు బాగా ట్రెండ్ అయ్యాయి.
అందులో రామ్ చరణ్ ఫుల్లుగా గడ్డంతో కనిపించి బలవంతుడిలా ఉన్న లుక్ బాగా వైరల్ అయింది. ఇక ఇటీవల సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చి చక్కర్ల కొట్టింది. అందులో రామ్ చరణ్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్న సీన్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమాకి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా ఓటిటి హక్కుల కోసం ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. భారీ డబ్బులు చెల్లించి ఈ సినిమా ఓటిటి హక్కులను సంపాదించుకోవాలని చూస్తున్నాయట. అందుతున్న సమాచారం ప్రకారం సోనీ లీవ్ సంస్థ ఈ సినిమా హక్కుల కోసం రికార్డు ధర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కానీ సినిమా యూనిట్ మాత్రం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ కు ఓటీటి హక్కులను ఇవ్వాలని ప్లానింగ్ లో ఉన్నాయంట. ఇక రాంచరణ్ ఆలోచన కూడా అదే కావడంతో నెట్ఫ్లిక్స్ తో టైయ్యప్ అయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరికి ఏ సంస్థ సొంతం చేసుకుంటుందో.