Chahal-Rj Mahvash: చాహల్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన మహ్‌వశ్!

టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అనివార్య కారణాలవల్ల చాహల్, ధన శ్రీ వర్మ విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అందుకుగాను చాహాల్.. ధనశ్రీ వర్మకి రూ. 60 కోట్ల భరణం కూడా చెల్లించినట్లు తెలిసింది.

ఇలా ఈ జంట విడాకుల వ్యవహారం ఆ మధ్య తరచూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి చాహల్ వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల అతడు మరో అమ్మాయితో కలిసి సందడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆఖరి పోరు జరిగింది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ట్రోఫీ కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూసేందుకు చాహల్తో పాటు మరో అమ్మాయి కూడా పక్కనే కూర్చుని దర్శనం ఇచ్చింది. దీంతో వారిద్దరిపై డేటింగ్ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు.. సోషల్ మీడియ ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకి మహ్ వస్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో వీరిద్దరూ పక్కపక్కన కూర్చుని తెగ ఎంజాయ్ చేశారు.

దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు జోరుగా సాగడం మొదలుపెట్టాయి. దీనిపై మహ్ వస్ తాజాగా స్పందించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తనపై వస్తున్న డేటింగ్ రూమర్ల గురించి స్పందించింది. ఏ తప్పు లేకుండా ఎలాంటి అసత్యాల గురించి పట్టించుకోకుండా మన పని మనం చేస్తూ ముందుకు పోవాలని తెలిపింది.

ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే వీరిద్దరూ కలిసి కనిపించడం ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్ లో కూడా చాహల్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. అప్పట్లో కూడా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆమె ఖండించింది.

తరవాత కథనం