Mustard oil for White Wair: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యం, దుమ్మూ, ధూళి, కొంత మందికి జన్యులోపాలు కారణంగా తెల్లజుట్టు వచ్చేస్తుంటుంది. ఇందుకోసం మార్కెట్లో ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతే కాదు జుట్టుకు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇందుకోసం మస్టర్డ్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
కళోంజీ సీడ్స్
పసుపు
మస్టర్డ్ ఆయిల్
విటమిన్ ఇ కాప్సూల్స్
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని.. అందులో కావాల్సినన్ని కళోంజీ సీడ్స్, అరకప్పు పసుపు వేసి బాగా నల్లగా మారేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై గిన్నెపెట్టుకుని అందులో రెండు కప్పుల మస్టర్డ్ ఆయిల్ వేసి, అందులో తయారు చేసుకున్న పొడిని కలిపి 10 నిమిషాల వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ కట్టేసి, అందులో రెండు విటమిన్ ఇ కాప్సూల్స్ కలిపి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. క్రమంగా తెల్లజుట్టు నల్లబడుతుంది. అంతే కాదు మస్టర్డ్ ఆయిల్, పసుపు, కళోంజీ సీడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ జుట్టుకు పెట్టుకోండి మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.