వేసవికాలంలో చాలామంది హైడ్రేట్ గా ఉండేందుకు పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లను తింటారు. వేడి తాపానికి గురు కాకుండా ఉండేందుకు వీటిని తీసుకుంటారు. వీటిలో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి ఇది ఎండ నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే చాలామంది పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్ లో పెడతారు.
ఆ తర్వాత కావలసినప్పుడు దాన్ని తింటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్ లో ఎక్కువ సమయం పుచ్చకాయను కట్ చేసి ఉంచి దాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
ఎందుకంటే ఇందులో 90 శాతం నీరు ఉండటం వల్ల తేమ ఎక్కువగా కలిగి ఉంటుంది. అదే సమయంలో ఫ్రిడ్జ్ లో కూడా తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా పెరగడానికి ఇది కారణమవుతుంది. అంతేకాదు ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఫ్రిడ్జ్ లో నిల్వచేసిన పుచ్చకాయ తింటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
అదే సమయంలో అలర్జీలు, చర్మ సమస్యలు, జుట్టు రాలిపోవడంతో సహా మరెన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పుచ్చకాయను కట్ చేసిన వెంటనే తినడం అత్యంత ఉత్తమం. ఇది తాజాగా ఉన్నప్పుడే తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. వీటితోపాటు.. కట్ చేసి ఎక్కువసేపు బయట ఉంచిన పుచ్చకాయలను తినడం కూడా మానేయాలి. దానివల్ల కూడా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.