కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వరుస సినిమాలతో హిట్లు కొడుతున్నాడు. ఓవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా దూసుకుపోతున్నారు. అతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో లవ్ టుడే సినిమాతో వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
దీని తర్వాత రీసెంట్ గా డ్రాగన్ మూవీ తో వచ్చాడు. మొదట ఈ మూవీ కోలీవుడ్లో రిలీజ్ అయింది. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ తో అదరగొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఆ చిత్రాన్ని తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో సినీప్రియుల్ని ఆకట్టుకుంది.
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు. ఇలా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు డైరెక్టర్, నిర్మాతలు అతడితో ఓ సినిమా తీసేందుకు రెడీ అయినట్లు సమాచారం.
డ్రాగన్ మూవీ హిట్ తర్వాత అతడికి తెలుగులో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అతడితో సినిమా చేసేందుకు రెడీ అయింది. సీతార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రదీప్ రంగనాథన్ ను తెలుగులో పరిచయం చేయనుంది. ఆ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించనున్నాడు.
మ్యాడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ ఇప్పుడు ప్రదీప్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం కళ్యాణ్ మ్యాడ్ 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రదీప్ తో మరో చిత్రానికి ఓకే చెప్పాడు. అతడి కోసం ఓ మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు తెలిసింది. మ్యాడ్ 2 సినిమా కంప్లీట్ అయ్యాక రవితేజతో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ రవితేజ కొత్త సినిమాతో బిజీగా ఉండడంతో ప్రదీప్ రంగనాథన్‌తో చేయనున్నట్లు తెలిసింది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.