మంచు విష్ణు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కుతోంది. ఇప్పుడు అందరు చూపు ఈ సినిమా పైనే ఉంది. ఇందులో పలు భాషల స్టార్ హీరోలు కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోలు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
దీంతో వీరందరినీ ఒకే స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చేనెల అంటే ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన లవ్ సాంగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంటర్వ్యూలో దానిపై కూడా విష్ణు స్పందించాడు. భక్తి సినిమాలో గ్లామర్ అవసరమా అనే ప్రశ్నపై అతడు మాట్లాడాడు.
భక్త కన్నప్ప సినిమాలోని బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. 2వ శతాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉండేవి?.. విమర్శించాలని కోణంలోనే చూస్తారని.. శివుడు పార్టన కూడా చాలామంది విమర్శించారని అన్నాడు. తాను సినిమా చేస్తున్నానే తప్ప డాక్యుమెంటరీ తీయట్లేదని అన్నాడు.
అందువల్లే సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని పేర్కొన్నాడు. ఇక తమ సినిమా ఓటిటి హక్కుల అమ్మకంపై కూడా స్పందించాడు. తాను పెట్టిన బడ్జెట్కు ఓటిటి కి అమ్మినంత మాత్రాన సేఫ్ అవ్వని అన్నాడు. ఈ సినిమా తన కెరీర్ లో పెద్ద రిస్క్ గా తీసుకున్నానని.. ఆ శివుడే కాపాడతాడని నమ్మకంతో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.