Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ఇక ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న అన్నిభాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం కన్నప్ప టీమ్ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటోంది. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని మంచు విష్ణు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉజ్జయిని మహాకేళశ్వర దేవాలయంలో కన్నప్ప రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.
తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలోని భక్త కన్నప్ప ఆలయాన్ని.. సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నాడు. తాను నటించిన భక్త కన్నప్ప మూవీ ఏప్రిల్ 25 న భారీ ఎత్తున వరల్డ్ వైడ్‌గా.. రిలీజ్ కాబోతున్న సందర్భంగా చిత్రబృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచు విష్ణుకు ఆలయ నిర్వాహకులు, ఊటుకూరు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. నిర్వాహకులు, అర్చకులతో చర్చంచి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని మంచు విష్ణు తెలిపారు.
ఇక కన్నప్ప సినిమాలో మోహన్ బాబుతో పాటు, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి హేమా హేమీలు నటిస్తుండడంతో.. ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్‌లో ఫోకస్ నెలకొంది. ఈ మూవీ 24 ఫ్రైమ్స్ ఫాక్టరీ, అవా ఎంటైర్ టైన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. ఇప్పటికే కన్నప్ప టీజర్, ఇటీవల్ సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప ఎలా ఉంటుందో చూడాలి.