Hair Growth Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈజీగా ఇలా హెయిర్ మాస్క్ చేసుకోండి!!

Hair Growth Tips

Hair Growth Tips: మారుతున్న జీవవ శైలి సరైన పోషకాలు లేని ఆహారం, కాలుష్యం వల్ల కురులు ఊడిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల చిన్నవయసులోనే జుట్టు ఊడిపోతుంటుంది. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, క్రీములు, షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయే తప్పా.. ఫలితం ఉండదు. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి, అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు.. జుట్టురాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నాచురల్ గా ఇంట్లోనే దొరికే పదార్దాలతో ఇలా చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారు చేసుకునే విధానం..

ఒక పాత్రలో కొబ్బరినూనె తీసుకుని అందులో తొక్క తీసిన ఐదు వెల్లపల్లిపాయలు వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత నూనెను సీసాలో స్టోర్ చేసుకోవాలి. తలస్నానం ముందు రోజు రాత్రి కుదుళ్లకు ఈ నూనె పట్టించి మర్ధన చేయాలి. తర్వాతి రోజు ఒక పాత్రలో కోడిగుడ్డు తెల్లసొన, ఒక కప్పు పెరుగు, కలబంద గుజ్జు, టేబుల్ స్పూన్, నిమ్మరం కలిపి తయారు చేసుకోవాలి. దీనిని తలకు పట్టించాక రెండు గంటలు ఆగి కండీషనర్‌తో తలస్నానం చెయ్యాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే.. మీ కురులు బలంగా ఉండడంతో పాటు అందంగా కూడా కనిపిస్తాయి.

రైస్ వాటర్, అలోవెరా జెల్ హెయిర్ మాస్క్

ముందుగా బియ్యం కడిగిన నీళ్లను ఫ్రిజ్‌లో పెట్టి గడ్డకట్టేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకుని, విటమిన్ ఇ క్యాప్సూల్స్,  ఫ్రిజ్‌లో పెట్టిన రైస్ వాటర్ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడంతో పాటు చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.

మందారం పువ్వులు , కొబ్బరి నూనె, హెయిర్ మాస్క్

ఉల్లిపాయ ముక్కలు, మందారం పువ్వులు, మందారం ఆకులు మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్, కలబంద కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడంతో పాటు చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం