AR Rahman: సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు..

AR Rahman

AR Rahman: భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డుకే అందాన్ని తీసుకొచ్చిన అపర సంగీత కోవిదుడు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతమే ఆయన ఊపిరి. స్వర కల్పనే ఆయన ప్రాణం. అందుకే ఇది ఎప్పటికి ఆయన జీవితంలో మమేకం అయిపోయింది. కీబోర్డు ప్లేయర్‌గా రెహ్మాన్ తన కెరియర్‌ను ప్రారంభించిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సక్సెస్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ సంగీత ప్రియులను విశేషంగా అలరించిన భారతీయ సంగీత దర్శకుడు తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అత్యవసర విభాగంలో చేరిన ఏఆర్ రెహ్మాన్ యాంజియోగ్రఫీ చికిత్స  పొందుతున్నారని, వైద్యుల బృందం ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెహ్మాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ యాజమాన్యం ఈ మధ్యాహ్నం అధికారంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు, సంగీత ప్రియులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆస్కార్ విన్నర్ త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.

ఇక కెరీర్ పరంగా ఏఆర్ రెహమాన్ ఆనందంగా ఉన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్య తలెత్తింది. 29 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత, రెహమాన్ అతని భార్య సైరా బాను 2024లో విడిపోయిన సంగతి తెలిసిందే. స్వయంగా తాను, రెహమాన్ విడిపోయామని సైరా బాను న్యాయవాది వందనా షా ద్వారా ఇటీవల ప్రకటించారు. అయితే ఎ.ఆర్ రెహమాన్ జీవితంలో విడాకులకు చోటు లేదని అందరూ అనుకున్నారు. భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు.

 

తరవాత కథనం