kalki sequel: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సీక్వెల్‌పై అప్డేట్ అదిరింది!

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను అలరించింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో స్టార్ కాస్టింగ్ కీలక పాత్రలో నటించి సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.

అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం సహా మరెందరో ఈ మూవీలో భాగస్వాములయ్యారు. ఈ చిత్రం గతేడాది విడుదలై కలెక్షన్ వర్షం కురిపించింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2000 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టిన ఈ సినిమా.. కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ భారి స్థాయిలో అలరించడంతో.. ఇప్పుడు అందరిలోనూ సెకండ్ పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సీక్వెల్ పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ అప్డేట్ వారికి సర్ప్రైజ్ అందించింది. అమితాబచ్చన్ ఈ మూవీ సీక్వల్ పై క్రేజీ అప్డేట్ అందించారు. కౌన్ బనేగా కరోడ్పతి రియాల్టీ షో పూర్తి చేసిన తర్వాత కల్కి 2 షూటింగ్లో పాల్గొంటానన్నారు. అంతేకాకుండా ఈ క్రేజీ సీక్వెల్ షూటింగ్ మే నెల నుంచి ప్రారంభమవుతుందని అతడు తెలిపాడు. అదే సమయంలో ఈ షెడ్యూల్ షూటింగ్ జూన్ 15 వరకు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఈ మూవీ షూటింగ్ పై కొన్ని వార్తలు జోరుగా సాగాయి. కల్కి సీక్వెల్ మూవీకి సంబంధించి ఆల్రెడీ 35 శాతం షూటింగ్ పూర్తయినట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. సెకండ్ పార్ట్ లో కమలహాసన్ పాత్ర మరింత పవర్ఫుల్గా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్ర కూడా సీక్వెల్లో ఎవరు ఊహించినంత రేంజ్ లో ఉంటుందని సినీవర్గాల నుంచి సమాచారం అందింది. చూడాలి మరి పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో.

తరవాత కథనం