ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త ఇది. బాహుబలి పార్ట్ 1 రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒకరకంగా బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది. దర్శకుడు రాజమౌళి సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించిన సినిమా ఇది.
ప్రభాస్ ను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా ఇది. ఎంతోమంది అగ్ర హీరోల సరసన ప్రభాస్ ను నిలబెట్టిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుందంటే ఊచ కోత అనే చెప్పాలి. ఇప్పుడు అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే మొన్న సలార్ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచి దుమ్ము లేపాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా బాహుబలి పార్ట్ 1 రీ రిలీజ్ అంటే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే అని చెప్పాలి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ నడవగా.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు.
ఈ ఏడాదిలోనే బాహుబలి 1, బాహుబలి 2 రీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పేశారు. పార్ట్ 1 రిలీజై జూలై నాటికి పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగానే అప్పుడు బాహుబలి 1ను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.