టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమనులలో సమంత ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి అతి కొద్ది సినిమాలతోనే మంచి స్టార్డం అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులర్ అయింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో తన అందం, యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కానీ ఆ సక్సెస్ ఎక్కువకాలం ఉండలేదు. కెరీర్ పీక్స్ లో ఉండగానే సామ్ లైఫ్ తలకిందులుగా మారింది. పెళ్లయిన నాలుగేళ్లకే భర్తతో విడాకులు, ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడాయి.
వరుసగా దెబ్బ మీద దెబ్బ పడడంతో ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్నాయి. మళ్లీ ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. వరుస సినిమాలను లైన్లో పెట్టింది. మరోవైపు నిర్మాణరంగంలో కూడా అడుగుపెట్టింది. ట్రలాల అనే పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది.
ఈ బ్యానర్ పై తొలి చిత్రం కూడా రూపొందింది. అదే శుభం చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇక సమంత మళ్లీ కం బ్యాక్ అయింది అనుకునే లోపు మరో సమస్య ఆమెను వెంటాడినట్టు తెలుస్తుంది. సామ్ మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
అందులో ఆమె హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ఫోటోకు సామ్ రికవరీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమెకి ఏమైంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఆమె చెప్పకపోవడంతో కంగారుపడుతున్నారు. త్వరగా ఆమె కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.