గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాదిలో గేమ్ చేంజర్ సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లు చిత్రీకరించాడు. ఇందులో రామ్ చరణ్‌ను అదిరిపోయే రేంజ్ లో చూపిస్తాడని అంతా భావించారు. కానీ అందరూ అంచనాలు తలకిందులు అయ్యాయి.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గేమ్ చేజర్ మూవీ తో మరింత పాపులర్ అవుతాడని అభిమానులు, సినీ ప్రియులు భావించారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకొని సతకిల పడింది. దీని తర్వాత రామ్ చరణ్ మరో మూవీని పట్టాలెక్కించాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇది రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమా. అందువల్ల ఈ చిత్రం RC 16గా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీకైన రామ్ చరణ్ ఫొటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు మరో వార్త నెట్టెంటా రచ్చ లేపుతుంది.
దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్, కబడ్డీ వంటి క్రీడలతో ఈ సినిమా సాగుతుందని ఇదివరకే జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని తాజాగా లీక్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఆటకూలీగా కనిపించబోతున్నట్లు సమాచారం వచ్చింది.
ఆట కూలి అంటే.. కొందరు మేనేజ్మెంట్ గా ఫామ్ అయ్యి ఆటగాలను కొనుక్కుంటారు. వారితో ఒక టీంను తయారు చేసుకుంటారు. అలా కొనుక్కున్న వాళ్లకి రోజుకు ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటారు. అలాంటి ఆటకూలి పాత్రలోనే రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలిసింది. అతడినే ఎక్కువ డబ్బులకు కొని ఆటలాడిపిస్తారని సినీ వర్గాల సమాచారం.
ఎన్నో మలుపు తిరిగే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తం విలేజ్ డ్రాప్ లోనే ఈ స్టోరీ నడుస్తుందని తెలిసింది. ఇప్పటివరకు ఇలాంటి కథ వెండితెర మీదకు రాలేదని.. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో.