Anupama Parameswaran: మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ!

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యూత్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సంపాదించుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ కు ఉన్నంత రేంజ్ అందుకున్నారు. ముఖ్యంగా ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉన్నారు.

అనుపమ ఒక్క పోస్ట్ పెట్టారంటే అది ట్రెండింగ్ లోకి రావాల్సిందే. ఒకప్పుడు చాలా సినిమాలు చేసినా.. అవేమి తనకు మంచి కంబ్యాక్ అందించలేదు. అయితే గత ఏడాది సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ మూవీ చేసింది. ఈ మూవీలో తన అందం, రొమాంటిక్ లుక్స్, కిస్సిక్ అనిపించే కిస్సింగ్ సీన్స్, యాక్టింగ్ అందర్నీ అలరించాయి. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో అనుపమ రేంజ్ మారిపోయింది.

ఇటీవల రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీలో నటించి మరింత క్రేజ్ అందుకుంది. ఇందులో తన యాక్టింగ్ అదర కొట్టేసింది. ఇప్పుడు తెలుగులో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు సంపత్ నంది హీరో శర్వానంద్ తో చేస్తున్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఓకే అయినట్లు సమాచారం. గతంలో శర్వానంద్ అండ్ అనుపమ పరమేశ్వరన్ శతమానం భవతి అనే మూవీ చేశారు.

ఆ మూవీ సంక్రాంతి టైంలో విడుదలై ఎనలేని హిట్ ను అందుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. వీరిద్దరూ జతకట్టడం అదే తొలిసారి. ఇక ఇన్నేళ్లకు మళ్ళీ ఈ జంట మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. సంపత్ నంది, శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో ఒక కొత్త సినిమా రెడీ అవుతోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కన ఉన్నట్లు తెలిసింది.

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి నారీ నారీ నడుమ మురారి. మరొకటి అభిలాష్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఆల్రెడీ నారి నారి నడుమ మురారి షూటింగ్ చివరి దశకు చేరుకుందట. దీంతో శర్వానంద్ ఇప్పుడు సంపత్ నందికి ఓకే చెప్పినట్లు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెళ్లడి కానున్నాయి.

తరవాత కథనం