బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తన మెరుస్తున్న, మచ్చలేని చర్మం కోసం వార్తల్లో నిలిచిపోయింది. ఆమె ఒక కుమార్తెకు తల్లి అయినా.. నేటి కాలంలో అలియా భట్ ప్రజలకు స్కిన్ కేర్ సింబల్‌గా మారిపోయింది. సంతూర్ మమ్మీ కంటే అందాన్ని ఆమె సొంతం చేసుకుంది. దీంతో అలియా తన మెరిసేటి చర్మం కోసం ఏం చేస్తుంది? అనే ప్రశ్న అందరిలోనూ రావచ్చు. అయితే ఆమె ప్రతిరోజూ ఉపయోగించే చర్మ సంరక్షణ దినచర్య చాలా సులభం.
అలియా భట్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ఫిట్‌నెస్, తన చర్మ సంరక్షణపై చాలా శ్రద్ధ చూపుతుంది. వీటన్నింటిని నిర్వహించడం ఎవరికైనా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పటికీ అలియా వీటన్నింటినీ తరచూ పాటిస్తుంది. అలియా భట్ తన స్కిన్ కేర్ రొటీన్‌లో ఏయే అంశాలను తీసుకుంటుందో తెలుసుకుందాం?
సాఫ్ట్ క్లెన్సర్
అలియా భట్ తన చర్మాన్ని రక్షించుకునేందుకు సాఫ్ట్ క్లెన్సర్ ఉపయోగిస్తుంది. దీని ద్వారా చర్మం నుండి మురికిని తొలగించడానికి మృదువైన క్లెన్సర్‌తో తన రోజును ప్రారంభిస్తుంది.
ఐస్ క్యూబ్స్ ఉపయోగం
నటి అలియా భట్ తన చర్మం తాజాగా, మెరుస్తూ ఉండటానికి ఐస్ క్యూబ్స్ ఉపయోగిస్తుంది. దీని కారణంగా ఆమె ముఖంలో సహజమైన మెరుపు కనిపిస్తుంది. అంతేకాకుండా రోజంతా ఆమె తాజాగా ఉంటుంది.
మాయిశ్చరైజర్
చర్మాన్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచడానికి.. ఆమె జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడానికి ఇష్టపడుతుంది. ఇది రోజంతా ఆమె చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా ఉంచుతుంది.
సన్స్క్రీన్
ఎండలోకి వెళ్లే ముందు, ఆలియా భట్ తన చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తుంది. ఎప్పుడు బయటకు వెళ్లినా.. అంతకు ముందు సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోదు. వీటి ద్వారానే ఆమె తన స్కిన్‌ను అందంగా ఉంచుకుంటుంది.