Coconut Water Benefits: చల్లని కొబ్బరి నీళ్లు అంటే ఇష్టపడనివారు ఉండరు. వేసవికాలంలో అయితే ఇది మరింత ప్రీతికరంగా అనిపిస్తాయి. కొబ్బరి నీళ్లు మన దాహాన్ని తీర్చడమే కాదు.. వీటి వల్ల మనకు ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో ఉండే అద్భుతమైన పోషకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు అలసటను, నీరసాన్ని తగ్గించి శరీరానికి శక్తిని పెంచుతాయనే విషయం మనందరికి తెలుసు. కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్‌లతో పాటు, పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాల లోపం ఉన్నవాళ్లు కొబ్బరి నీటిని తాగడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. మన శరీరంలో కండరాలు సవ్యంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఇక కాల్షియం విషయానికి వస్తే.. ఒక గ్లాసు కొబ్బరి నీటిలో 19.2 మి.గ్రా కాల్షియం ఉంటుంది.
మనలో చాలా మంది మన శరీరానికి అవసరమైనంత స్థాయిలో కాల్షియంను తీసుకోవట్లేదు. తగినంత కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనమవుతాయి. అలాగే పలు వ్యాధులకు గురవుతాయి. కొబ్బరి నీటిలో అధిక స్థాయిలో ఉన్న మెగ్నీషియం కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం. మన శరీరంలో ప్రొటీన్లు తయారుకావాలన్నా.. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలన్నా కండరాలు నరాలు, చక్కగా పనిచేయాలన్నా మెగ్నీషియం చాలా అవసరం, ఖనజాల లోపం ఉన్నవారికి కొబ్బరి నీరు చక్కగా పనిచేస్తాయి.
కొబ్బరినీళ్లలో కార్బోహైడ్రేట్ లు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కొబ్బరినీళ్లను ఆహారంలో, ఇతర పానీయంలో కలపకుండా యథాతదంగా తీసుకోవడం మంచిది. సాధారణంగా ఇవి సురక్షితమైనవి. వీటివల్ల ఎలాంటి హానికలగదు. అయితే గర్భవతులు, పాలిచ్చే తల్లులు ఈ నీటిని, వీటిలోని ఔషద లక్షణాల కోసం తాగవచ్చా లేదా అనే విషయంలో మనకు తగినంత సమాచారం లేదు.