Henna For White Hair: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి తెల్లజుట్టు సమస్యగా మారింది. ముఖ్యంగా యువతే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. తెల్లజుట్టును కవర్ చేసేందుకు మార్కెట్లో దొరికే హెయిర్ డైలు , హెయిర్ సీరమ్‌లు వాడుతున్నారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయి తప్పా.. శాశ్వతంగా పనిచేయవు. పైగా వాటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
భవిష్యత్తులో మెదడు నరాలను బలహీనంగా మార్చి.. మతిమరుపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది సహజ పదార్ధాలతో జుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఈ సూపర్ టిప్‌ను పాటించండి మంచి ఫలితం ఉంటుంది. శాశ్వతంగా తెల్లజుట్టు నల్లగా మార్చేస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
టీ పొడి
బీట్‌రూట్
హెన్నా
మందారం ఆకులు
మందారం పువ్వులు
కొబ్బరినూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో గ్లాసు వాటర్ తీసుకొని, టీ పొడి మూడు టేబుల్ స్పూన్, బీట్ రూట్ ముక్కలు, మందారం ఆకులు, పువ్వులు వేసి 10 నిమిషాలపాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకుని రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, గోరింటాకు పొడి కలిపి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి.
గంటపాటు అలానే ఉంచి సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. తెల్లజుట్టును క్రమంగా నల్లగా మారుతుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.