Case File Against YouTubers: 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్ల అరెస్ట్? లిస్టులో ఆ ప్రముఖ యాక్టర్స్..!

Case File Against YouTubers

గతంలో వీరంతా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టించారు. ఈ ప్రమోషన్స్ చేయడానికి పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోరాటం చేస్తున్నారు. ఆయనే ప్రతీ రోజు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని పోలీసులకు సూచిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ అను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అప్పటి నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఇకపై తాము ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటామని చెబుతున్నారు. తెలియక తప్పుచేశామని క్షమాపణలు కూడా చెబుతూ వీడియాలు రిలీజ్ చేశారు. అంతేకాదు.. బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని ఫాలోవర్స్ కు సూచిస్తున్నారు.

బెట్టింగ్​ యాప్స్​ వల్ల అప్పలపాలై తెలంగాణలో గతేడాది వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. యువత, చిరు వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్‌ను ఫాలో అవుతున్నవారే ఎక్కువగా ఈ బెట్టింగులకు దగ్గరవుతున్నారని పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీల సాయంతో సామాన్యులను తమ విషవలయంలోకి యాప్స్​ నిర్వాహకులు లాక్కుంటున్నారు. ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది.

పోలీసులు ఈ ఇష్యూని ప్రభుత్వం కూడా సీరియస్‌​గా తీసుకున్నారు. ఆ యాప్స్‌ను ప్రమోట్​ చేస్తున్నావారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి చర్యలు మొదలు పెట్టారు. బెట్టింగ్స్ యాప్స్ వ్యతిరేకంగా చట్టాలు కూడా కఠినం అయ్యాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ అయితే బెయిల్ కూడా రావడం కష్టమేనని చెబుతున్నారు.

అయితే ఇదే బెట్టింగ్ ముఠాలో హైదరాబాదులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిరణ్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో బెట్టింగ్ యాప్స్‌ను కిరణ్ గౌడ్ ప్రమోట్ చేశారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్స్ చేయించాడు కిరణ్ గౌడ్. అయితే పోలీసుల వ్యవస్థలో పనిచేస్తునే కిరణ్ గౌడ్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్లు తేల్చారు. పోలీసులు కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం